Tv424x7
PoliticalTelangana

విద్యుత్ పరిస్థితి గందరగోళంగా ఉంది.. సీఎండీపై చర్యలు తీసుకోవచ్చా?: రేవంత్ రెడ్డి

🟦విద్యుత్ పరిస్థితిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని సీఎం రేవంత్ ఆదేశం.

.🟦నేడు జరగనున్న సమీక్షకు సీఎండీలను పిలవాలని సూచన.

.🟦అధికారులు సమర్థవంతంగా పని చేయకుంటే ప్రభుత్వానికి ఇబ్బందులు వస్తాయని హెచ్చరిక..

🟦రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితి గందరగోళంగా ఉందని… విద్యుత్ పరిస్థితిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్ర రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కేబినెట్ సమావేశంలో విద్యుత్ పరిస్థితిపై విస్తృతంగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… సీఎండీపై చర్యలు తీసుకునే అవకాశం ఉందా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం జరగనున్న సమీక్షకు సీఎండీలను కూడా పిలవాలని ఆదేశించారు. సీఎండీ రాజీనామాను ఆమోదించవద్దన్నారు. ఆరు గ్యారెంటీలపై కర్ణాటకకు వెళ్లి అధ్యయనం చేయాలని సూచించారు. ప్రజల ఆకాంక్షల మేరకు అధికారుల పని తీరు ఉండాలని సూచించారు. అధికారులు సమర్థవంతంగా పని చేయకుంటే ప్రభుత్వానికి ఇబ్బందులు వస్తాయని హెచ్చరించారు.

Related posts

భూదాన్ పోచంపల్లి ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం

TV4-24X7 News

కామారెడ్డి జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య?

TV4-24X7 News

నేటి నుంచి వైన్‌షాపులు బంద్..

TV4-24X7 News

Leave a Comment