Alla Ramakrishna Reddy: మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామాఅమరావతి: వైకాపాకు గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) తన పదవికి రాజీనామా చేశారు. వైకాపా సభ్యత్వానికీ రాజీనామా ఆయన చేసినట్లు తెలిపారు..ఎమ్మెల్యే పదవికి స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేసిన ఆర్కే.. స్పీకర్ కార్యాలయానికి వెళ్లి సభాపతి కార్యదర్శికి ఆ లేఖను అందజేశారు. మంగళగిరి వైకాపా ఇన్‌ఛార్జ్‌గా గంజి చిరంజీవికి ఆ పార్టీ బాధ్యతలు అప్పగించింది. ఈ నేపథ్యంలోనే ఆర్కే అసంతృప్తికి గురై రాజీనామా చేసినట్లు సమాచారం..రాజీనామా అనంతరం ఆర్కే మీడియాతో మాట్లాడారు. ”ఎమ్మెల్యే పదవికి, వైకాపాకు వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేశా. స్పీకర్ కార్యాలయంలో లేఖను అందజేశాను. దీన్ని ఆమోదించాలని స్పీకర్‌ను కోరా. రాజీనామాకు గల కారణాలను త్వరలో తెలియజేస్తా”అని ఆయన చెప్పారు..

previous post