శ్రీసత్యసాయి: జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. బుధవారం కొడికొండ చెక్‌పోస్టు వద్ద కంటైనర్‌లో తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. కంటైనర్ గంజాయితో హైదరాబాద్ నుంచి బెంగుళూరుకు వెళుతున్నట్లు గుర్తించారు..గంజాయి తరలిస్తున్న కంటైనర్‌ను వీడియోలు తీయకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. గంజాయి తరలింపుకు సంబంధించి వివరాలను కూడా పోలీసులు వెల్లడించని పరిస్థితి. ఉన్నతాధికారులే వివరాలు వెల్లడిస్తారని పోలీసులు చెబుతున్నారు. కంటైనర్ సమీపంలోకి మీడియా వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి..

previous post