రాష్ట్రంలోని ప్రైవేట్ ఆసుపత్రులు బుధవారం (సెప్టెంబర్ 17) నుంచి ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేయాలని నిర్ణయించాయి. కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున బిల్లులు పెండింగ్‌లో ఉంచడం వల్ల తాము ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆసుపత్రుల యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేశాయి.
వేలాది మంది పేద రోగులకు ముఖ్యమైన ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రస్తుతం ప్రైవేట్ ఆసుపత్రులే ప్రధాన భారం మోస్తున్నాయని, కానీ ప్రభుత్వం చెల్లింపులు సకాలంలో చేయకపోవడం వల్ల తమకు మందులు, సిబ్బంది వేతనాలు, నిర్వహణ ఖర్చులు భరించడం కష్టమవుతోందని స్పష్టం చేశాయి.

