ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఎస్పి హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు పోలీసులు మంగళవారం రాత్రి బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తున్న వారిని గుర్తించారు.
పోలీసులు బహిరంగంగా మద్యం తాగుతున్న వారికి కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు జరిమానా విధించారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడం చట్టరీత్యా నేరమని అటువంటి వారిపై కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు మందుబాబులను హెచ్చరిస్తున్నారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ఓపెన్ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించినట్లు తెలిపారు.

