Tv424x7
Crime NewsTelangana

కొత్తగూడెంలో దారుణ హత్య….

కొత్తగూడెం గణేష్‌ టెంపుల్‌ ఏరియాలో అర్ధరాత్రి భయానక హత్య జరిగింది. సింగరేణి రిటైర్డ్ కార్మికుడు రామ్మోహన్ రావు (గౌతంపూర్ ఏరియా)ను గుర్తు తెలియని వ్యక్తులు విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశారు.

సమాచారం ప్రకారం, నిందితుడు రామవరం వాసిగా అనుమానం వ్యక్తమవుతోంది. ముఖానికి మాస్క్‌ ధరించి ఇంట్లోకి ప్రవేశించిన అతను, సుత్తితో తలపై దాడి చేసి రామ్మోహన్ రావును చంపాడు. అనంతరం నిందితుడిని బైక్‌పై వదిలిన మరో వ్యక్తి అక్కడి నుంచి పారిపోయాడు.

హత్య కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ఈ ఘటనతో ప్రాంతంలో తీవ్ర ఆందోళన, భీతావహ పరిస్థితి నెలకొంది.

సంఘటనా స్థలానికి చేరుకున్న డీఎస్పీ అబ్దుల్ రెహమాన్, 3వ టౌన్ పోలీస్ సిబ్బందితో కలిసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కదలికలపై క్లూల కోసం పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీలను జల్లెడపడుతున్నారు.

Related posts

తెలంగాణ సచివాలయం ఉద్యోగులకు తాగునీటి కష్టాలు!!

TV4-24X7 News

హైదరాబాద్‌లో చెన్నై విద్యార్థినిని రేప్ చేసిన యువకులు

TV4-24X7 News

రంగారెడ్డి జిల్లా ఆరుట్ల గ్రామంలో విషాదం!!

TV4-24X7 News

Leave a Comment