Tv424x7
Telangana

టీఎస్‌ఆర్టీసీ బస్సులు ఇప్పుడు గూగుల్‌ మ్యాప్స్‌లో — ప్రయాణికులకు భారీ సౌకర్యం!

హైదరాబాద్‌:

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికులకు మరో స్మార్ట్‌ సర్వీస్‌ అందించబోతోంది. ఇకపై రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ బస్సుల లైవ్ లొకేషన్‌ గూగుల్‌ మ్యాప్స్‌లో చూడగలుగుతారు. దీతో బస్సు ఎక్కడుందో, ఎంతసేపట్లో తమ స్టాప్‌కి చేరుకుంటుందో కచ్చితంగా తెలుసుకోవచ్చు.

దీపావళి నాటికి మొత్తం 9,500 బస్సుల జీపీఎస్‌ డేటాను గూగుల్‌కు షేర్‌ చేయాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. ప్రతి 30 సెకన్లకోసారి బస్సుల కదలికలు మ్యాప్స్‌లో అప్‌డేట్‌ అవుతాయి.

ఈ కొత్త ఫీచర్‌ వల్ల ప్రయాణికులు తమ ప్రయాణాన్ని ముందుగానే ప్లాన్‌ చేసుకోవచ్చు. గూగుల్‌ మ్యాప్స్‌లో “ట్రాన్సిట్‌” ఆప్షన్‌ ఎంచుకొని, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారో ఎంటర్‌ చేస్తే — బస్సు నంబర్‌, రాకపోకల సమయం, మధ్య స్టాప్‌లు, తదుపరి బస్సు సమయాలు అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి.

ప్రస్తుతం ఆర్టీసీకి ఉన్న ‘గమ్యం’ యాప్‌ సరైనగా పనిచేయకపోవడంతో, గూగుల్‌ మ్యాప్స్‌ ద్వారా మరింత నమ్మకమైన సేవ అందించాలనే నిర్ణయానికి అధికారులు వచ్చారు.

మొదటగా సిటీ బస్సుల్లో ఈ సదుపాయం ప్రారంభించి, తరువాత జిల్లా మరియు అంతర్రాష్ట్ర బస్సులకు విస్తరించనున్నారు.

ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి మాట్లాడుతూ,“గూగుల్‌తో భాగస్వామ్యం వల్ల ప్రజలకు నిజమైన రియల్‌టైమ్‌ సమాచారం అందుతుంది. ఇక బస్సు కోసం నిలబడి ఎదురుచూడాల్సిన అవసరం లేదు,” అని పేర్కొన్నారు.

Related posts

వృత్తి విద్యా కాలేజీలు రేపటి నుండి బంద్‌ హెచ్చరిక.

TV4-24X7 News

జూనియర్ డాక్టర్ హత్యాచారం కేసులో ఆసుపత్రి మాజీ ప్రిన్సిపల్ అరెస్ట్?

TV4-24X7 News

రాజీవ్ యువ వికాసానికి 9 లక్షల అప్లికేషన్లు..!!

TV4-24X7 News

Leave a Comment