Tv424x7
National

ఒమన్‌ నుంచి బయలుదేరిన ఎల్‌పీజీ నౌకలో అగ్ని ప్రమాదం – యూరోపియన్‌ నేవల్‌ ఫోర్స్‌ వీరోచితంగా రక్షణ చర్యలు

ఒమన్‌ నుంచి కామెరూన్‌లోని జిబౌటికి ఎల్‌పీజీని తరలిస్తున్న ‘ఎంపీ ఫాల్కన్’ అనే నౌకలో అకస్మాత్తుగా అగ్ని ప్రమాదం సంభవించింది.

ఈ ఘటన సమయంలో నౌకలో ఉన్న సిబ్బందిలో 23 మంది భారతీయులు సురక్షితంగా బయటపడ్డారు.

యూరోపియన్ యూనియన్ నేవల్ ఫోర్స్ (EUNAVFOR) సకాలంలో స్పందించి అందరినీ సురక్షితంగా తీరానికి తరలించింది.

అగ్ని ప్రమాదానికి హూతీ మిలిటెంట్ల దాడే కారణమని వస్తున్న వార్తలను అధికారులు ఖండించారు.

అయితే, ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు ప్రారంభించినట్లు సముద్ర భద్రతా విభాగం తెలిపింది.

ప్రస్తుతం నౌకను సముద్రంలోనే నియంత్రణలోకి తీసుకువచ్చేందుకు రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి.

ప్రమాదానికి గల కారణం స్పష్టతకు ఇంకా కొద్ది గంటలు పట్టే అవకాశం ఉందని సమాచారం.

Related posts

క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని

TV4-24X7 News

డొనాల్డ్ ట్రంప్‌కి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

TV4-24X7 News

భారతీయుడి గుండెతో పాక్‌ యువతికి కొత్త జీవితం

TV4-24X7 News

Leave a Comment