కడప జిల్లా బద్వేల్లో ఆన్లైన్ ప్రేమ పేరుతో భారీ మోసం జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్వేర్ ఉద్యోగి అశోక్‌ను ప్రేమ పేరుతో నమ్మించి రూ.81.67 లక్షలు కాజేసిన కేసులో ఇద్దరు నిందితులను బద్వేల్ పోలీసులు అరెస్ట్ చేశారు.బాధితుడి ఫిర్యాదు మేరకు ఈ ఏడాది ఫిబ్రవరిలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, పరారీలో ఉన్న రామలింగారెడ్డి మరియు పూజిత రెడ్డి అలియాస్ మానసలను చెన్నంపల్లె ఫ్లైఓవర్ సమీపంలో అదుపులోకి తీసుకున్నారు.దర్యాప్తులో నిందితులు Play99 Exchange, Sky Exchange, Paytrust App వంటి ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఈ కేసులో భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 319(2), 318(4), 308(6)తో పాటు 3(5) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.నిందితులు మోసం చేసి సంపాదించిన డబ్బును ఆన్లైన్ బెట్టింగ్‌లలో వినియోగించినట్లు విచారణలో తేలిందని పోలీసులు వెల్లడించారు.ఈ సందర్భంగా బద్వేల్ సీఐ రామకృష్ణ మాట్లాడుతూ, యువత ఆన్లైన్ ప్రేమ ఉచ్చులు, సైబర్ మోసాలు, బెట్టింగ్ యాప్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎలాంటి అనుమానాస్పద ఆన్లైన్ కార్యకలాపాలు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
previous post

