Tv424x7
Andhrapradesh

శింగనమల ఎమ్మెల్యేపై సీఎం జగన్‌ ఆగ్రహం

అమరావతి :- శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతిపై వైకాపా (YSRCP) అధినేత, సీఎం జగన్‌ (YS Jagan) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫేస్‌బుక్‌ లైవ్‌లో ఆమె మాట్లాడిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన నేపథ్యంలో ఆయన వివరణ కోరారు..దీంతో ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) నుంచి పద్మావతికి పిలుపొచ్చింది. వెంటనే తాడేపల్లి రావాలని సీఎంవో అధికారులు సూచించారు. దీంతో ఆమె అమరావతికి చేరుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో కలిసి సీఎం జగన్‌ను కలవనున్నారు.మరోవైపు మాజీ మంత్రులు బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, వెలంపల్లి శ్రీనివాస్‌, ఎంపీ గోరంట్ల మాధవ్‌కు జగన్‌ అపాయింట్‌మెంట్‌ ఇచ్చారు. సాయంత్రంలోగా వారు సీఎంను కలవనున్నారు. తమ సీట్ల విషయంపై జగన్‌తో చర్చించనున్నారు.

Related posts

బాబు షూరిటీ భవిషత్తు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న పుట్టా

TV4-24X7 News

కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటన.. అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు..

TV4-24X7 News

సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌

TV4-24X7 News

Leave a Comment