Tv424x7
National

తమిళనాడులో ఘోరం.. బాణాసంచా పేలి 9 మంది మృతి

Tamil Nadu: తమిళనాడులో (Tamil Nadu) ఘోర విషాదం చోటుచేసుకుంది. వెంబకోట్టైలోని బాణాసంచా ఫ్యాక్టరీలో (firecracker blast) భారీ పేలుడు సంభవించి తొమ్మిది మంది మృతి చెందారు..పలు తీవ్రంగా గాయపడ్డారు..స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. భారీ పేలుడు సంభవించిందని తెలిపారు. పేలుడు తీవ్రతకు క్రాకర్ ఫ్యాక్టరీ సమీపంలోని నాలుగు భవనాలు ధ్వంసమయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఏడుగురు అక్కడికక్కడే మృతిచెందారి.. మరో ఇద్దరు ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు విడిచారని స్థానికులు తెలిపారు. ఫ్యాక్టరీ నగరంలోని వెంబకోట్టై ప్రాంతానికి చెందిన విజయ్ అనే వ్యక్తిగా గుర్తించారు..స్థానికుల సమాచారం మేరకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. ఫ్యాక్టరీలోని కెమికల్ మిక్సింగ్ రూమ్‌లో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు..

Related posts

ఇలా చేస్తే.. మీ ఆధార్ డేటా సేఫ్.!

TV4-24X7 News

మాజీ ప్రధాని పీవీ నరసింహరావుకు భారతరత్న

TV4-24X7 News

పంజాబ్ నేషనల్ బ్యాంక్ కు ఆర్బీఐ జరిమానా

TV4-24X7 News

Leave a Comment