Tv424x7
Andhrapradesh

టిడిపికి చెందిన ముఖ్య నాయకులు మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరిక.

నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని 24వ వార్డు సాయిబాబా నగర్ టిడిపికి చెందిన టిడిపి మైనార్టీ సెల్ పార్లమెంట్ కార్యదర్శి అబ్దుల్ సలాం మరియు వారి కుటుంబ సభ్యులు సన్నిహితులు మరో 25 కుటుంబాలు 24 వ వార్డు ఇంచార్జ్ రహంతుల్లా ఆధ్వర్యంలో మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సిపి లో చేరారు…ఈ సందర్భంగా మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రతి హామీని చెప్పిన ప్రతి మాటను అమలు చేసిన గొప్ప నాయకుడని మాటిస్తే మడమతిప్పని నాయకుడిగా ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయాడని టిడిపిలో ఉన్న చాలామంది నాయకులు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ అభివృద్ధిని చూసి వైసిపిలో చేరుతున్నారని తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి పై గెలిచే సత్తా లేక బిజెపి జనసేనతో పొత్తుల కోసం పాకులాడుతున్నారని ప్రజలకు మంచి చేసే ఆలోచన తెలుగుదేశం నాయకులకు లేదన్నారు నంద్యాలలో 14 సంవత్సరాలు పదవులు అనుభవించి ప్రజలకు ఒక మంచి కూడా చేయకపోవడం చాలా బాధాకరమన్నారు నంద్యాల అభివృద్ధి జరిగిందంటే అది శిల్పా కుటుంబ హయాంలోనే జరిగిందన్నారు వచ్చే ఎన్నికలలో అందరం కలిసి వైసిపి అభ్యర్థులను ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి గెలిపించుకోవాలని అన్నారు వైసీపీలో చేరిన వారు నబి రసూల్, కాజా మొద్దీన్ ,బషీర్, అక్బర్ బాషా, హుస్సేన్ బాషా, ఖలీల్, అబ్దుల్ హదీ, అబ్దుల్ వాహిద్, జాకీర్, ఫరూక్, నూరు బాషా, అజారుద్దీన్, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు

Related posts

జగన్ మోహన్ రెడ్డిని సీఎంగా చేసుకునేందుకు అన్నదమ్ముల్లా కలసి పనిచేస్తాం

TV4-24X7 News

షర్మిల కుమారుడు లవ్ మ్యారేజ్

TV4-24X7 News

భరతమాత ముద్దు బిడ్డను కోల్పోయింది: రాష్ట్రపతి ముర్ము

TV4-24X7 News

Leave a Comment