కడప జిల్లా : ఏ నియోజకవర్గానికి ఎన్ని రౌండ్ల ఓట్ల లెక్కింపు
124- బద్వేలు నియోజకవర్గానికి సంబంధించి 272 పోలింగ్ స్టేషన్ల పోలింగ్స్ కు గాను 20 కౌంటింగ్ రౌండ్లు, 126- కడపకు సంబంధించి 287 పోలింగ్ స్టేషన్లకు 21 కౌంటింగ్ రౌండ్లు, 129-పులివెందులకు 301 పోలింగ్ స్టేషన్లకు 22 రౌండ్లు, 130-కమలాపురంకు 251 పోలింగ్ స్టేషన్లకు గాను 18 రౌండ్లు, 131- జమ్మలమడుగుకు 315 పోలింగ్ స్టేషన్లకు గాను 23.రౌండ్లు, 132-ప్రొద్దుటూరు 268 పోలింగ్ స్టేషన్లకు గాను 20 రౌండ్లు, 133-మైదుకూరు అసెంబ్లీ 269 పోలింగ్ స్టేషన్లకు గాను 20 కౌంటింగ్ రౌండ్లను ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి , జిల్లా కలెక్టర్ విజయరామరాజు చెప్పారు. ఈ నెల 27న కౌంటింగ్ స్టాఫ్ కు మొదటి రాండమైజేషన్, జూన్ 2న రెండవ రాండమైజేషన్, అలాగే 4వ తేదీ కౌంటింగ్ రోజున ఉదయం 5 గంటలకు 3వ రాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేయడం జరుగుతుందన్నారు. ఈ కౌంటింగ్ ప్రక్రియ అంత కూడా ఎన్నికల సాధారణ/ కౌంటింగ్ పరిశీలకులు, రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో జరుగుతుందన్నారు.