బలిజసేన ఈ రోజు మధ్యాహ్నం తిరుపతి ఎన్ జి ఓ కాలనీ లోని అరణి శ్రీనివాసులు గారి నివాసానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ, పర్యాటక మంత్రి శ్రీ కందుల దుర్గేష్ విచ్చేసారు. వీరిని తిరుపతి శాసనసభ్యులు అరణి శ్రీనివాసులు ఘనస్వాగతం పలికారు. అనంతరం బలిజసేన రాష్ట్ర అధ్యక్షులు ఆర్కాట్ కృష్ణప్రసాద్ ను పరిచయం చేసారు. అనంతరం మంత్రిగారిని లేఖ ద్వారా కాపు కార్పొరేషన్ ఛైర్మెన్ పదవికి రాయలసీమ బలిజలకు అవకాశం ఇవ్వాలని అభ్యర్థించారు. ఎన్నో ఏళ్ళ నుండి రాయలసీమ ప్రాంతంలో బలిజలు అటు ఆర్థికంగా ఇటు రాజకీయంగా అణిచివేతకు గురిఅయ్యారని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం బలిజలపట్ల చిన్నచూపు చూసిందని, ఒక్క. డైరెక్టర్ పదవి కుడా ఇవ్వలేదని ఆవేదనను వెలిబుచ్చారు. యువనాయకత్వాన్ని ప్రోత్సహించే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు గారికి కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవి బలిజలకు అవకాశం ఇవ్వాలని వారికీ తెలిజేయాలని మంత్రిగారిని వేడుకున్నారు.ఈ కార్యక్రమంలో బలిజసేన అధ్యక్షులు ఆర్కాట్ కృష్ణప్రసాద్, ప్రధానకార్యదర్శి బెల్లం కొండ సురేష్, తిరుమల అధ్యక్షులు కలల హరిప్రసాద్ , తోట జయంతి, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

next post