Tv424x7
Andhrapradesh

బెట్టింగ్ యాప్ లపై ఉక్కుపాదం మోపుతాం: మంత్రి లోకేష్

బెట్టింగ్ యాప్‌లపై ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. బెట్టింగ్ యాప్‌ల వలన జీవితాలు నాశనం అవుతున్నాయని తనకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఎక్స్‌లో పెట్టిన ఒక పోస్టుపై లోకేష్ తీవ్రంగా రియాక్టయ్యారు. “బెట్టింగ్ యాప్‌లు జీవితాలను నాశనం చేస్తున్నాయి. జూదానికి బానిసైన యువత నిరాశలోకి నెట్టబడుతున్నారని నేను వందలాది హృదయ విదారక ఘటనలు వింటున్నాను. ఇది ఆపాలి. దీర్ఘకాలిక పరిష్కారం ఏమిటంటే నిరంతర అవగాహన, ఇంకా.. బెట్టింగ్ యాప్‌లపై కఠినంగా వ్యవహరించడం. మొత్తం దేశానికే ఒక ఉదాహరణగా నిలిచే సమగ్ర బెట్టింగ్ వ్యతిరేక విధానంపై కృషి చేస్తున్నాం. ఈ ముప్పును అంతం చేయడానికి అన్ని చట్టపరమైన మార్గాలను అన్వేషిస్తాము.” అని సదరు పోస్టులో లోకేష్ చెప్పారు.

Related posts

వివేకా మర్డర్ కేసు : అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు ఖాయమేనా ?

TV4-24X7 News

జెడ్‌ ప్లస్‌ భద్రత కోసం హైకోర్టుకు మాజీ సీఎం జగన్‌ మోహన్ రెడ్డి

TV4-24X7 News

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా ఓపెన్ హౌస్ ఏర్పాటు చేసిన గాజువాక సీఐ

TV4-24X7 News

Leave a Comment