Tv424x7
Telangana

బ్యాలెన్స్‌డ్ డైట్ కోత: ఆరోగ్యానికి ముప్పు..

తెలంగాణలో ప్రజలు తినే తిండిలో బ్యాలెన్స్‌డ్ డైట్ పాటించడం వెనుకబడింది. ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ICMR) తాజా స్టడీ ప్రకారం, రాష్ట్రంలో తిండిలో 67% అన్నమే, కార్బోహైడ్రేట్లు 70%, కొవ్వు పదార్థాలు 25%, మరియు ప్రోటీన్లు, విటమిన్లు కేవలం 10% మాత్రమే ఉండటంతో ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి.

పండ్లు, కూరలు తక్కువగా తినటం, ప్రోటీన్ కోసం ఎక్కువగా చికెన్‌పై ఆధారపడటం, పప్పులు తక్కువగా తీసుకోవడం, ఇలా ఆహారం అసమతుల్యత వల్ల షుగర్, గుండె జబ్బులు, ఊబకాయం వంటి వ్యాధులు రాష్ట్రంలో పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటికే 12% మంది షుగర్, 15.4% మంది ప్రీ-డయాబెటిస్ పరిస్థితిలో ఉన్నారు.

ICMR సూచన ప్రకారం, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు న్యూట్రిషన్ అవగాహన కల్పించాలి, బ్యాలెన్స్‌డ్ డైట్ ప్రోత్సహించే ప్రణాళికలు రూపొందించాలి. నేషనల్ గైడ్‌లైన్ ప్రకారం రోజువారీ 2,000 క్యాలరీల ఆహారంలో 50% కార్బ్స్, 10% కొవ్వు, 20–25% ప్రోటీన్ ఉండాలి.

స్టడీ ప్రకారం, ఈశాన్య రాష్ట్రాల్లో అన్నం ఎక్కువగా తీసుకోవడం సమస్యగా ఉంది. దానివల్ల ఆరోగ్యానికి ముప్పు ఉందని, ప్రభుత్వ చర్యలు తక్షణం తీసుకోవాల్సిన అవసరం ఉందని ICMR హెచ్చరించింది.

Related posts

హీరో విజయ్ దేవరకొండకు కారు ప్రమాదం!

TV4-24X7 News

రేపటి నుంచి సమ్మెకు దిగనున్న జూ. డాక్టర్స్

TV4-24X7 News

100 ఎకరాల్లో హైకోర్టు భవనం

TV4-24X7 News

Leave a Comment