Tv424x7
Andhrapradesh

అన్నమయ్య జిల్లాలో కల్తీ మద్యం కేసు: రెండు టీడీపీ నేతలకు సస్పెన్షన్.

అన్నమయ్య జిల్లా ములకలచెరువులో కల్తీ మద్యం తయారీ కేసులో తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకుంది. తంబళ్లపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి దాసరిపల్లి జయచంద్రారెడ్డి మరియు స్థానిక నేత కట్టా సురేంద్ర నాయుడులను పార్టీ నుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేశారు.

పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు నిన్న రాత్రి విడుదల చేసిన ప్రకటనలో, పూర్తి స్థాయి విచారణ చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తీసుకోబడిందని ఆయన స్పష్టంచేశారు.

నకిలీ మద్యం వ్యవహారంలో జయచంద్రారెడ్డి వ్యక్తిగత కార్యదర్శి రాజేశ్, సన్నిహితుడు జనార్దన్ రావు మరియు ఇతర సమీప బంధువుల పాత్రను ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. వారిపై కేసు నమోదు చేసినట్టు అధికారులు తెలిపారు.

ఈ చర్యతో పార్టీ లో కఠినమైన నియంత్రణ విధానానికి, మత్తుమద్యం వ్యతిరేక పట్టుదలకు రాజకీయ పరంగా సంకేతం ఇచ్చిందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Related posts

అమరజీవికి అసలైన నివాళి….

TV4-24X7 News

డీల్లీ చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు

TV4-24X7 News

50 మందికి పైగా నకిలీ డాక్టర్లు పట్టివేత

TV4-24X7 News

Leave a Comment