Tv424x7
Andhrapradesh

తాడేపల్లి క్యాంప్ ఆఫీస్‌కు ఎమ్మెల్యేలు.. సజ్జలతో భేటీ

అమరావతి: తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయానికి పలువురు ఎమ్మెల్యేలు చేరుకున్నారు. బుధవారం కర్నూలు, చిత్తూరు, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు సీఎం కార్యాలయానికి వచ్చారు..సీఎం క్యాంప్ ఆఫీసుకు ఎమ్మెల్యేలు బ్రిజేందర్ రెడ్డి, నవాజ్ పాషా, బియ్యపు మధుసూదన రెడ్డి వచ్చారు. అలాగే ఎంపీ మార్గాని భరత్ కూడా సీఎం ఆఫీస్‌కు వచ్చారు. సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చిన ఎంపీ, ఎమ్మెల్యేలతో ప్రభుత్వం సలహాదారుడు సజ్జల రామకృష్ణా రెడ్డి భేటీ అయ్యారు. ఒక్కొక్కరితో సజ్జల భేటీ అవుతున్నారు. సజ్జలతో భేటీ అనంతరం సీఎం జగన్‌తో ఎమ్మెల్యేలు భేటీ అయ్యే అవకాశం ఉంది..

Related posts

టిటిడి ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడుకు శ్రీపద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల ఆహ్వానం

TV4-24X7 News

కీసరలో 50 కోట్ల భూమి కబ్జా ప్రయత్నం సంచలనం

TV4-24X7 News

బహిరంగంగా మద్యం సేవించిన వారికి కౌన్సిలింగ్!!

TV4-24X7 News

Leave a Comment