Tv424x7
Telangana

నల్గొండ: గిరిజన రైతుపై థర్డ్ డిగ్రీ దాడి – జాతీయ మానవ హక్కుల కమిషన్ చర్యలకు ఆదేశాలు..

నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గిరిజన రైతు సాయి సిద్దుపై పోలీసులు థర్డ్ డిగ్రీ పద్ధతిలో దాడి చేసిన ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ కఠిన చర్యలకు ఆదేశాలు ఇచ్చింది.

సాయి సిద్దు యూరియా కోసం ధర్నా చేపట్టిన సందర్భంలో పోలీసులు అతనిని విచక్షణారహితంగా కొట్టినట్టు ఫిర్యాదు జరిగింది. అతని భార్యను కులం పేరుతో దూషించి, సాయి సిద్దుపై తీవ్ర దాడి చేసినట్లు సమాచారం.

సామాజిక వేత్త రవంత్ ఈ ఘటనను జాతీయ మానవ హక్కుల కమిషన్ వద్ద ఫిర్యాదు చేశారు.

కమిషన్ ఆదేశాల ప్రకారం:ఎస్పీ శ్రీకాంత్ రెడ్డి, కానిస్టేబుల్‌ను తక్షణమే విధుల నుండి తొలగించాలి.

ఉన్నత స్థాయి విచారణ చేపట్టి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి సూచనలు జారీ.

జాతీయ మానవ హక్కుల కమిషన్ ఈ సంఘటనపై శీఘ్రంగా చర్యలు తీసుకోవాలని స్పష్టంగా తెలిపింది.

Related posts

తెలంగాణ హైకోర్టుకు ఇద్దరు కొత్త న్యాయమూర్తులు

TV4-24X7 News

మరొకరి వద్ద భర్త.. మద్యానికి బానిసైన భార్య.. చివరికి ఆత్మహత్య!!

TV4-24X7 News

మహిళలకు ఉతిత బస్సు ఉండాలా వద్దా

TV4-24X7 News

Leave a Comment