Tv424x7
Andhrapradesh

రాష్ట్రపతి ఆమోదం అనంతరం బదిలీ ఉత్తర్వులు జారీ..

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ముగ్గురు న్యాయమూర్తులను ఏపీ హైకోర్టుకు బదిలీ చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.

గుజరాత్‌ హైకోర్టులో పనిచేస్తున్న జస్టిస్‌ మానవేంద్రనాథ్‌రాయ్, అలహాబాద్‌ హైకోర్టుకు చెందిన జస్టిస్‌ డూండి రమేష్, కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సుబేందు సమంతలను ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం గతంలో సిఫారసు చేసింది.

ఆ సిఫారసులకు అనుగుణంగా రాష్ట్రపతి ఆమోదం లభించగా, అధికారిక బదిలీ ఉత్తర్వులు జారీ అయ్యాయి. త్వరలోనే ఈ ముగ్గురు న్యాయమూర్తులు అమరావతిలోని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో బాధ్యతలు స్వీకరించనున్నారు.

Related posts

శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం

TV4-24X7 News

39 వార్డు అధ్యక్షులు ముజీబ్ ఖాన్ ఆధ్వర్యంలో బాబు షూరిటీ మోసం గ్యారేంటి కార్యక్రమం

TV4-24X7 News

పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా’’ అంటూ రాయించుకొని తిరగకండి

TV4-24X7 News

Leave a Comment