Tv424x7
Andhrapradesh

మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ — మదిరేపల్లిలో వైఎస్సార్సీపీ నేతల ఉద్యమం

మెడికల్‌

కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం దువ్వూరు మండలంలోని మదిరేపల్లి గ్రామపంచాయతీ పరిధిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఉత్సాహంగా ప్రారంభమైంది.ఈ కార్యక్రమానికి మైదుకూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ —“మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ జరిగితే పేద విద్యార్థులకు వైద్య విద్య అందనంత దూరం అవుతుంది. ఫీజులు భారంగా మారి, ప్రజలకు ఉచిత వైద్యం అందుబాటులో ఉండదు. ప్రజా ఆరోగ్య వ్యవస్థ క్షీణించి, లక్షల కోట్ల విలువ చేసే ప్రభుత్వ ఆస్తులు ప్రైవేట్‌ చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది” అని ఆందోళన వ్యక్తం చేశారు.ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజల మద్దతుతో కోటి సంతకాల సేకరణ చేపడుతున్నామని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల నాయకుడు నారుపల్లె అంకిరెడ్డి సారథ్యంలో మదిరేపల్లి పంచాయతీ వైఎస్సార్సీపీ కార్యకర్తలు, స్థానిక నాయకులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Related posts

నాలుగు టన్నుల చౌక బియ్యం పట్టివేత..

TV4-24X7 News

అది అబద్ధపు ప్రచారం.. రాజకీయ పదవులపై నాకు ఆసక్తి లేదు: నాగబాబు

TV4-24X7 News

మహిళా హోంగార్డు ఆత్మహత్యాయత్నం – పోలీసులు నిర్లక్ష్యం..

TV4-24X7 News

Leave a Comment