Tv424x7
National

వీధి కుక్కలపై సుప్రీం సంచలన వ్యాఖ్యలు!

న్యూ ఢిల్లీ: దేశవ్యాప్తంగా వీధి కుక్కల దాడులు పెరుగుతుండటంపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
జస్టిస్ విక్రమ్ నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం మాట్లాడుతూ —

“వీధి కుక్కల ఉన్మాదం భారత ప్రతిష్ఠను అంతర్జాతీయ స్థాయిలో దెబ్బతీస్తోంది. ఇలాంటి ఘటనలు విదేశీయులు మన దేశాన్ని తక్కువ చేసి మాట్లాడటానికి కారణమవుతున్నాయి,” అని వ్యాఖ్యానించారు.

కుక్కల దాడులు మానవులపై క్రూరత్వంగా మారుతున్నాయంటూ కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.
“మానవులపై జరిగే ఈ దాడుల గురించి పిటీషనర్లు ఏమంటారు?” అని సుప్రీం ప్రశ్నించింది.

గత ఆగస్టు 22న సుప్రీం కోర్టు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వీధి కుక్కల నియంత్రణ చర్యలపై అఫిడవిట్‌లు సమర్పించాలని ఆదేశించింది. అయితే, ఆదేశాలను అమలు చేయని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు సమన్లు జారీ చేసింది.

పశ్చిమ బెంగాల్‌, తెలంగాణ మినహా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల చీఫ్ సెక్రటరీలకు ఈ సమన్లు జారీ అయ్యాయి.

తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేయగా, అఫిడవిట్‌లు ఎందుకు సమర్పించలేదో వివరణ ఇవ్వాలని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది.

Related posts

ఫ్రీ బస్సు తీసేసే ఆలోచనలో కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం

TV4-24X7 News

పోలవరం ప్రాజెక్ట్ పనులను 2027కు పూర్తి చేయాలని లక్ష్యం!

TV4-24X7 News

మణిపూర్‌ పర్యటనకు ప్రధాని మోదీ…ఇందుకేనా..?

TV4-24X7 News

Leave a Comment