Tv424x7
Telangana

చిట్యాల ఐలమ్మ (చాకలి ఐలమ్మ)129 వ జయంతి సందర్భంగా వీరనారి ఐలమ్మకు విప్లవ జోహార్లు..

చిట్యాల ఐలమ్మ చాకలి ఐలమ్మగా గుర్తింపు పొందిన తెలంగాణ వీర వనిత వీరు 1919లో జన్మించి 10, సెప్టెంబర్ 1985లో పరమ పదించారు 1919లో వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కృష్ణాపురం గ్రామంలో ఓరుగంటి మల్లమ్మ సాయిలు నాలుగో సంతానముగా చాకలి ఐలమ్మ జన్మించింది పాలకుర్తి కి చెందిన చిట్యాల నర్సయ్య తో ఐలమ్మ బాల్య వివాహం జరిగింది (అప్పటికి ఆమె వయస్సు 13 ఏడ్లు) వీరికి 5 గురు కుమారులు ఇద్దరు కుమార్తెలు ఆర్థికంగా వెనుకబడిన కుటుంబం చాకలి కులవృత్తి వారికి జీవనాధారం 1940-1944 మధ్యకాలంలో విస్నూర్ లో దేశ్ముఖ్ రజాకార్ల అరాచకాలపై ఎదురు తిరిగి ఎర్రజెండా పట్టింది ఐలమ్మ అగ్రకులాల స్త్రీలు దొరసానులు కూడా దొర అని పిలవకపోతే ఉధృత కులాలతో పాటు వారి అణువుఉ o పు డు కత్తెలలో కూడా ఉన్న రక్షస ప్రవృత్తి అనేక పీడన రూపాలు విరుచుకు పడేవి తమను దూరాన్ని పిలువని ఉత్పత్తి కులాల స్త్రీ మీద తమ భర్తలను ఉసి గొల్పి దగ్గరుండి అఘయిత్యం చేయించేవారు ఈ భూమి నాది పండించిన పంట నాది తీసుకెళ్లడానికి దొరేవ్వాడు నా ప్రాణం పోయాకే ఈ పంట భూమి మీరు దక్కించు కోగలరు అంటూ మాటల్ని తూటాలుగా మలుచుకొని దొరల గుండెల్లో బడ బగ్నీలా రగిలిన తెలంగాణ రైతాంగ విప్లవాగ్ని చాకలి ఐలమ్మ మల్లంపల్లి భూస్వామి కొండలరావుకు పాలకుర్తిలో 40 ఎకరాల భూమి ఉండగా ఐలమ్మ కౌలుకు తీసుకుంది అందులో నాలుగు ఎకరాలు సాగు చేశారు పాలకుర్తి పట్వారి వీరమనేని శేషగిరిరావు కు ఐలమ్మ కుటుంబానికి విరోధం ఏర్పడింది జీడి సోమ నర్సయ్య నాయకత్వంలో ఆంధ్ర మహాసభ ఏర్పడింది ఐలమ్మ ఆ సంఘంలో సభ్యురాలు పాలకుర్తి పట్వారి శేషగిరిరావు ఐలమ్మను కుటుంబంతో వచ్చి తన పొలంలో పనిచేయాలని ఒత్తిడి చేయడంతో పనిచేయడానికి నిరాకరించింది పాలకుర్తి పట్వారి పప్పులు ఉడక ఐలమ్మ కుటుంబం కమ్యూనిస్టు ల్లో చేరిందని విసునూర్ దేశ్ ముఖ్ రాపాక రామ్ చంద్ర రెడ్డికి ఫిర్యాదు చేశాడు కేసులో అగ్ర నాయకులతో పాటు ఐలమ్మ కుటుంబాన్ని ఇరికించారు అయినప్పటికీ కోర్టులో తీర్పు దేశ్ ముఖ్ కు వ్యతిరేకంగా వచ్చింది ఐలమ్మ కుటుంబాన్ని ధాన్యం తమదేనని పంటను కోసుకు రమ్మని వంద మందిని దేశ్ముఖ్ పంపాడు ఆంధ్ర మహాసభ కార్యకర్తలు వరిని కోసి వరికట్టలు కట్టి ధాన్యాన్ని ఐలమ్మ ఇంటికి చేర్చారు భీమ్ రెడ్డి నరసింహారెడ్డి ఆరుట్ల రామచంద్రారెడ్డి చకిలం యాదగిరి లు సైతం ధాన్యపు బస్తాలను భుజాలపై మోశారు కొండ లక్ష్మణ్ బాపూజీ సహకారంతో ఐలమ్మకు అనుకూలంగా తీర్పు వచ్చింది రజాకారుల ఉపసేనాధిపతి అయినా దేశ్ముఖ్ రెండుసార్లు పరాజయం పాలయ్యాడు ఐలమ్మ ఇంటిని కూడా తగలబెట్టారు ధనాన్ని ధాన్యాన్ని ఎత్తుకెళ్లారు, ఐలమ్మ కుమారులు ముగ్గురు పాలకుర్తి పట్వారి ఇంటిని కూల్చి అదే స్థలంలో మొక్కజొన్న పంటను పండించారు అనేక రకాలుగా నష్టపోయినప్పటికీ ఐలమ్మ కుటుంబం ఎర్రజెండను వీడలేదు ఈ దొర గాడు ఇంతకంటే ఇంకా నన్ను ఏ విధంగా నష్టపెట్టగలడు అని తనలో తాను ప్రశ్నించుకున్నది నీ దొరోడు ఏం చేస్తాడు రా అని మొక్కవోని ధైర్యంతో రోకలి బండ చేత బూని గుండాలను తరిమికొట్టింది కాలినడకన వెళ్లి దొరకు సవాలు విసిరింది ఐలమ్మ భూ పోరాటంలో విజయంతో పాలకుర్తి దొర ఇంటిపై కమ్యూనిస్టులు దాడి చేసి ధాన్యాన్ని ప్రజలకు పంచారు ఐలమ్మ భూ పోరాటంలో మొదలుకొని సాయుధ రైతాంగ పోరాటంలో చివరి వరకు నాలుగు వేలమంది ఉత్పత్తి కులాల వారు అమరులయ్యారు 10 లక్షల ఎకరాలు భూ పంపిణీ జరిగింది ప్రజా పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచిన ఐలమ్మ సెప్టెంబర్ 10-1985 న అనారోగ్యంతో మరణించింది..✍️

Related posts

10 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ తహసీల్దార్

TV4-24X7 News

10వ, 12వ తరగతుల సీబీఎస్సీ బోర్డు పరీక్షల షెడ్యూల్‌ 2024 విడుదల

TV4-24X7 News

జాతీయ రహదారుల ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి సమావేశం

TV4-24X7 News

Leave a Comment