Tv424x7
Telangana

చెల్లి నుంచి ‘జాగృతి’నీ లాగేస్తున్న కేటీఆర్..!

తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) తన తోడబుట్టిన చెల్లి పట్ల మరింతగా కఠినంగా వ్యవహరిస్తున్న వైనం సుస్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన కేటీఆర్… తాజాగా ఆమె స్థాపించిన తెలంగాణ జాగృతి సంస్థను కూడా ఆమె నుంచి లాగేసుకునే యత్నాలకు పదును పెట్టారు. అందులో భాగంగా ఇప్పటికే తొలి అడుగు కూడా పడిందని చెప్పాలి. జాగృతి ఏర్పాటు సందర్భంగా కవితతో పాటు కీలకంగా వ్యవహరించిన పలువురు నేతలను కేటీఆర్ రంగంలోకి దించారు.

కేటీఆర్ రంగంలోకి దింపిన నేతల్లో రాజీవ్ సాగర్, రాజారాం యాదవ్, మఠం బిక్షపతి తదితరులు గురువారం ఏకంగా హైదరాబాద్ లో మీడియా సమావేశాన్నే ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు కవిత తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ కు రాజీనామా చేసి తమను నడిరోడ్డుపై పడేసిందని రాజీవ్ సాగర్ ఆవేదన వ్యక్తం చేశారు. అసలు ఎవరిని అడిగి ఆమె ఈ నిర్ణయం తీసుకుందని కూడా ఆయన ప్రశ్నించారు. జాగృతి ఆవిర్భావంలో కవితతో కలిసి సాగామని, సంస్థలో కవితకు ఎంత పాత్ర ఉందో తమకూ అంతే పాత్ర ఉందని ఆయన చెప్పుకొచ్చారు.

అంతటితో ఆగని రాజీవ్ సాగర్… అసలు తెలంగాణ జాగృతి తమదేనని, సంస్థ తరఫున కార్యకలాపాలు కొనసాగించేందుకు తమకే అర్హత ఉందని కూడా చెప్పారు. ఇంకా చెప్పాలంటే… జాగృతిపై కవితకు ఎలాంటి హక్కు లేదని ఆయన చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ కు అనుబంధంగానే జాగృతి ఏర్పాటు అయ్యిందన్నారు. తాను ఇప్పటికీ బీఆర్ఎస్ లోనే ఉన్నామని, పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాలే తమకు శిరోధార్యమని పేర్కొన్నారు. కేసీఆర్ చెప్పినట్టే తాము నడుచుకుంటామని చెప్పారు. ఈ విషయంలో ఎలాంటి అనుమాలకు తావు లేదని తెలిపారు.

కవిత పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన రెండు రోజుల్లోనే జాగృతిలో చీలిక రావడం గమనార్హం. వాస్తవానికి హరీశ్ రావు, సంతోష్ రావులపై కవిత ఘాటు వ్యాఖ్యలు చేసిన కాసేపటికే ఎర్రవలి ఫామ్ హౌస్ లోని తండ్రి చెంతకు చేరిన కేటీఆర్ గడచిన 5 రోజులుగా అక్కడే ఉంటున్నారు. ఈ క్రమంలో కవితపై సస్పెన్షన్ వేటు పడింది. ఆ తర్వాత కూడా అక్కడే ఉంటూ సుధీర్ఘ మంతనాలు జరుపుతున్న కేటీఆర్… కవితను ఏకాకిని చేయడమే లక్ష్యంగా మరింత కఠిన నిర్ణయాలు అవసరమని బావించినట్లున్నారు. అందులో బాగంగానే జాగృతిని కూడా కవిత చేతిలో నుంచి లాగేసేందుకు వ్యూహం రచించినట్టు సమాచారం.

Related posts

నేడే రుణమాఫీ నిధులు విడుదల రైతుల ఖాతాలోకి 7 000 వేల కోట్లు

TV4-24X7 News

రామకోటి రామరాజు గోటి తలంబ్రాల కార్యక్రమం అద్బుతం :-గజ్వేల్ ఎసై సైదా

TV4-24X7 News

మహిళలకు డబుల్ బొనంజా.. పండక్కి ఒకటి కాదు రెండు చీరలు!

TV4-24X7 News

Leave a Comment