హైదరాబాద్ నగరాన్ని హిల్లు చేసిన దేవుడి లడ్డూకి కోట్లు వెచ్చించిన భక్తులు!
హైదరాబాద్ రిచ్‌మండ్ విల్లాస్‌లో వినాయకుని లడ్డూ రికార్డు స్థాయిలో వేలంలో అమ్ముడైంది. కమ్యూనిటీ సభ్యులు సద్భావంతో ఈ లడ్డూను ఏకంగా రూ. 2 కోట్లు 31 లక్షల 74 వేల రూపాయలకు దక్కించుకున్నారు.
ప్రతి సంవత్సరం వినాయక చవితి సందర్భంగా భక్తుల భక్తిని, ఉత్సాహాన్ని చూపించే ఈ లడ్డూ వేలం… ఈ ఏడాది మరింత ప్రత్యేకంగా నిలిచింది. పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని వేలంపాటను జయప్రదం చేశారు.
వినాయకునికి లడ్డూ ప్రీతికరమైన ప్రసాదం. అందుకే గణనాథుడి దయ కోసం, ఆశీస్సులు కోసం భక్తులు ఇలా వేలంలో పాల్గొంటున్నారు.