తెలంగాణ ప్రభుత్వం ఇటీవల భారీ ప్రకటనలతో “ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 60 వేల ఉద్యోగాలు ఇచ్చాం” అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రాండ్ ఈవెంట్ నిర్వహించిన విషయం తెలిసిందే. కానీ ఈ ప్రకటన వెనుక అసలు నిజం ఏమిటో తెలుసుకుంటే, నిరుద్యోగుల ముక్కున వేలేసుకునే పరిస్థితి ఏర్పడింది.
20 ఏండ్ల నుండి వీఆర్వోలుగా (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్) పనిచేస్తున్న వారికి కొత్తగా ఉద్యోగాలు ఇచ్చినట్లు నియామక పత్రాలు ఇవ్వడం ఏమిటి!.
ప్రపంచంలో ఎవరూ 60 వేల ఉద్యోగాలు ఇవ్వలేదు అంటూ అబద్ధాలు చెప్తూ భజన చేయడం, దానికి సీఎం స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డి హాజరవడం ఏమిటి!
కొన్ని సంవత్సరాలుగా ఒకరి పేరిట ఉన్న భూమిని మరొకరికి భూ యజమాని అనుమతి లేకుండా పట్టాలు మారుస్తూ, రెవెన్యూ శాఖలో భారీగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న వీఆర్వో వ్యవస్థను గత ప్రభుత్వ హయాంలో ధరణి వచ్చిన తరువాత రద్దు చేయగా, అందులో చేస్తున్న వారిని కొంత కాలం తరువాత జీపీఓ (గ్రామ పరిపాలన ఆఫీసర్)గా మార్చారు.
ఇప్పుడు వారికి కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చినట్లు పెద్ద పండగలా ప్రోగ్రాం చేసి దానికి సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు అందివ్వడమే కాకుండా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 60 వేల ఉద్యోగాలు ఇచ్చాం అంటూ భజన సైతం చేయించుకున్నారు.
ఈ చోద్యం చూసి నిరుద్యోగులు ముక్కున వేలేసుకున్నారు.