Tv424x7
Andhrapradesh

నంద్యాల జిల్లా వ్యాప్తంగా కార్డన్ & సెర్చ్ ఆపరేషన్లు

41 మోటార్ సైకిళ్లు – 37 మద్యం బాటిళ్లు – 3 బీర్లు స్వాధీనం

నంద్యాల జిల్లా వ్యాప్తంగా పోలీసులు భారీ ఎత్తున కార్డన్ & సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించారు. జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఐపీయస్ ఆదేశాల మేరకు నేటి తెల్లవారుజామున పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఒకేసారి ఈ తనిఖీలు జరిగాయి.

ఆపరేషన్‌లో భాగంగా వైస్సార్ నగర్ (నంద్యాల తాలూకా), బిలకలగూడూరు గ్రామం (గడివేముల), దొమ్మర కాలనీ (ఆళ్లగడ్డ టౌన్), తాటిపాడు గ్రామం (జూపాడుబంగ్లా) ప్రాంతాల్లో పోలీసులు ఇళ్లను, వాహనాలను, అనుమానితులను తనిఖీ చేశారు.

ఈ క్రమంలో సరైన ధ్రువపత్రాలు లేని 41 మోటార్ సైకిళ్లు, 37 క్వార్టర్ బాటిళ్లు, 3 బీరు బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే అక్రమంగా మద్యం కలిగి ఉన్న ఇద్దరిపై కేసులు నమోదు చేశారు.తనిఖీల సందర్భంగా పోలీసులు రౌడీ షీటర్లు, నేరచరిత్ర గలవారి ఇళ్లు కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసి, వారి వేలిముద్రలను మొబైల్ చెక్ డివైస్ ద్వారా పరిశీలించారు.జనాలకు పోలీసులు విజ్ఞప్తి చేస్తూ –గ్రామాల్లో గొడవలకు పోకుండా పోలీసులను సంప్రదించాలికొత్తవారు లేదా అనుమానాస్పద వ్యక్తులు గ్రామంలో కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలి అని కోరారు.అలాగే ప్రజల్లో అవగాహన కల్పిస్తూ సైబర్ క్రైమ్ మోసాలపై జాగ్రత్తగా ఉండాలని, ఫేక్ APK ఫైళ్లు (ఎస్.బి. ఐ, ట్రాఫిక్ ఈ-చలాన్, PM-Kisan వంటివి) డౌన్‌లోడ్ చేయరాదని హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు స్వీయ నియంత్రణ పాటించాలని సూచించారు.ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా మాట్లాడుతూ, “శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు ఎల్లప్పుడూ ప్రజలకు అండగా ఉంటారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొంటే కఠిన చర్యలు తప్పవు” అని హెచ్చరించారు.

Related posts

దుర్గమ్మను దర్శించుకున్న చంద్రబాబు దంపతులు.

TV4-24X7 News

ఏపీలో రూ.6 వేల పింఛన్లలోనూ భారీగా అనర్హులు

TV4-24X7 News

శ్రీశైలం వెళ్లే భక్తులకు శుభవార్త..

TV4-24X7 News

Leave a Comment