కడప జిల్లా పొరుమామిళ్లకు చెందిన దాసరిపల్లి దినేష్ కుమార్కు ప్రతిష్ఠాత్మక బెస్ట్ సోషల్ సర్వీస్ అవార్డు లభించింది. డాక్టర్ మాణికిరెడ్డి హెల్త్ కేర్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా – కాకినాడ ఆధ్వర్యంలో ఈ అవార్డును ఈరోజు కాకినాడలో JNTUK వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ CSRK ప్రసాద్ చేతుల మీదుగా అందజేశారు.సమాజంలో మానవ హక్కులపై అవగాహన కల్పించడంలో ముఖ్యపాత్ర పోషించినందుకు దినేష్ కుమార్‌ను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ మాట్లాడుతూ, ప్రస్తుత యువత తమ హక్కులను తెలుసుకోవడంతో పాటు వాటిపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ సమాజ అభివృద్ధిలో ముందుకు సాగాలని కోరారు.ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ కాకినాడ జిల్లా చైర్మన్ డా. మాణికిరెడ్డి సత్యనారాయణ, వైస్ చైర్మన్ డా. నమఃశివయ్య, డైరెక్టర్ డా. తురక సూర్యరావు, డా. హరినాధ్ రాజా తదితరులు పాల్గొన్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: