చౌడేశ్వరి నగర్‌లో ₹17 లక్షలతో CC రోడ్డు, డ్రైనేజీ పనులు ప్రారంభం

చౌడేశ్వరి నగర్‌లో ₹17 లక్షలతో CC రోడ్డు, డ్రైనేజీ పనులు ప్రారంభం

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

 

మైదుకూరు: మైదుకూరు మున్సిపాలిటీ 22వ వార్డు చౌడేశ్వరి నగర్‌లో మౌలిక వసతుల అభివృద్ధికి మరో ముందడుగు పడింది. DMF గ్రాంట్ నిధులు ₹17 లక్షలతో చేపట్టనున్న CC రోడ్డు, డ్రైనేజీ పనులకు మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ గురువారం భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు.

చౌడేశ్వరి నగర్‌లో రోడ్లు, డ్రైనేజీ సమస్యలపై స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా, స్పందించిన ఆయన సంబంధిత అధికారులతో సమన్వయం చేసి నిధులు మంజూరు చేయించేందుకు చొరవ తీసుకున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి గ్రామం, వార్డులో ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు వంటి ప్రాథమిక సదుపాయాలను మెరుగుపరిచి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.పనులు పూర్తయితే చౌడేశ్వరి నగర్‌లో రాకపోకల సౌకర్యంతో పాటు పారిశుధ్య పరిస్థితులు మెరుగుపడనున్నాయని అధికారులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *