మండల స్థాయి చెకుముకి సైన్స్ పోటీలలో మొదటి స్థానం సాధించిన శ్రీ శంకరాచార్య హై స్కూల్ విద్యార్థులు :- పాఠశాల కరెస్పాండెంట్ ములే రామమోహన్ రెడ్డి
జన విజ్ఞాన వేదిక వారి ఆధ్వర్యంలో మండల స్థాయి చెకుముకి సైన్స్ పోటీల్లో మైదుకూరు ఎంఈఓ కార్యాలయంలో శుక్రవారం జరిగిన పోటి పరీక్షల్లో దువ్వూరు మండల ఫస్ట్ సాధించినగుడిపాడు గ్రామం శ్రీ శంకరాచార్య హైస్కూల్ విద్యార్థులు.. ఈ పోటీల్లో నారుపల్లె చేతన్ కుమార్ రెడ్డి (చిన్న సింగనపల్లె ) మరియు మంచాల సోమనాథ్ రెడ్డి (చిన్న సింగనపల్లె ), తూల బండి కాత్యాయని(సంజీవరెడ్డిపల్లె ) అనే విద్యార్థులు పాఠశాల తరఫున పాల్గొని దువ్వూరు మండల ప్రథమ స్థాయిలో నిలిచారు..వీరికి జన విజ్ఞాన వేదిక కడప జిల్లా కోఆర్డినేటర్ జె సుబ్బయ్య చేతుల మీదుగా సర్టిఫికెట్స్ అందించడం జరిగింది. అలాగే వీరిని పాఠశాల కరస్పాండెంట్ రామ్మోహన్ రెడ్డి మరియు ఉపాధ్యాయ బృందము, స్థానికులు అభినందించడం జరిగింది.
దువ్వూరు, సెప్టెంబర్ 11:
మండల కేంద్రమైన దువ్వూరుతో పాటు గుడిపాడు గ్రామంలో పోషణ మాసోత్సవాల కార్యక్రమాలను నిర్వహించారు. సెప్టెంబర్ 9 నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు నెల రోజుల పాటు మండలంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ మాసోత్సవాలను నిర్వహించనున్నట్లు సూపర్వైజర్లు వరలక్ష్మి, సౌజన్య తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ “మన అంగన్వాడీ – మన బాధ్యత” అనే లక్ష్యంతో అంగన్వాడీ కేంద్రాలను కేవలం పోషకాహార పంపిణీ కేంద్రాలుగా కాకుండా, సమాజ భాగస్వామ్యంతో కూడిన సంరక్షణ, ఆరోగ్య కేంద్రాలుగా తీర్చిదిద్దడమే కార్యక్రమం ఉద్దేశమని తెలిపారు.
చిరుధాన్యాలు (మిల్లెట్స్), పప్పుధాన్యాలు, ఆకుకూరలు, పండ్లు, ప్రోటీన్లు అధికంగా ఉండే స్థానిక ఆహార పదార్థాల వినియోగంపై అవగాహన కల్పిస్తామని చెప్పారు. గర్భిణులు, బాలింతలు, ఆరు నెలల నుంచి మూడు సంవత్సరాల లోపు పిల్లలకు నిబంధనల ప్రకారం టేక్ హోమ్ రేషన్ ద్వారా పౌష్టికాహారం అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే 3 నుంచి 6 సంవత్సరాల చిన్నారులకు నిర్ణీత మెనూ ప్రకారం నాణ్యమైన వేడి పౌష్టికాహారం అందిస్తున్నట్లు వివరించారు.
అంగన్వాడీ మేనేజ్మెంట్ కమిటీలను బలోపేతం చేసి, కేంద్రాల పర్యవేక్షణలో స్థానిక ప్రజలను భాగస్వామ్యం చేయడం ద్వారా సమాజ భాగస్వామ్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
ఆరు సంవత్సరాల లోపు పిల్లల మానసిక, శారీరక ఎదుగుదలకు అవసరమైన పోషకాహారంతో పాటు ఆటల ద్వారా విద్య (ECCE) అందించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. ప్రధానమంత్రి మాతృ వందన యోజన (PMMVY) కింద అర్హులైన గర్భిణులు, బాలింతలను గుర్తించి నమోదు చేయాలని సూచించారు.
అదేవిధంగా IVR కాల్స్‌కు సంబంధించిన సమాచారాన్ని సూపర్వైజర్ సౌజన్య ప్రజలకు వివరించారు.
ఈ కార్యక్రమంలో గర్భిణులు, బాలింతలు, చిన్నారుల తల్లిదండ్రులతో పాటు అంగన్వాడీ కార్యకర్త రమాదేవి, ఆయా బాలనాగమ్మ, ఆశా వర్కర్ పాల్గొన్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: