వైసీపీలోకి భారీగా చేరికలు..
టీడీపీకి చెందిన 80 కుటుంబాలు వైసీపీలో చేరిక
ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీడీపీకి చెందిన 80 కుటుంబాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు స్థానిక వైసీపీ నేతలు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కొత్తగా పార్టీలో చేరిన వారికి వైసీపీ కండువాలు కప్పి ఆహ్వానించారు.24వ వార్డు ఇన్చార్జ్ వెంకటరమణారెడ్డి, యువ నాయకుడు కొత్తపల్లె రాజేష్ ఆధ్వర్యంలో టీడీపీకి చెందిన కుటుంబాల ప్రతినిధులు, యువకులు వైసీపీలో చేరినట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు భూమిరెడ్డి వంశీధర్ రెడ్డి, పాతకోట బంగారు రెడ్డి, పాతకోట వంశీధర్ రెడ్డి, ఎంపీపీ శేఖర్ యాదవ్, వైసీపీ యువజన విభాగం నాయకుడు గురునాథ్ రెడ్డి, వైసీపీ బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి గోటూరు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీని నమ్మి పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ తగిన గౌరవం, సముచిత స్థానం కల్పిస్తామని తెలిపారు. స్థానిక నాయకులు వెంకటరమణారెడ్డి, కొత్తపల్లె రాజేష్ చేసిన కృషిని అభినందించారు.
కాగా, 80 కుటుంబాలు వైసీపీలో చేరినట్లు పార్టీ వర్గాలు వెల్లడించగా, ఈ చేరికలతో ప్రొద్దుటూరు వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొందని పేర్కొన్నాయి.
Save or share this story as a newspaper-style Epaper Clip: