Tv424x7
Andhrapradesh

24 నుంచి ఏపీ అసెంబ్లీ – జగన్‌కు మంచి చాన్స్ !

ఫిబ్రవరి 24 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్‌ను రాజ్ భవన్ విడుదల చేసింది. ఈ సారి మూడు వారాల పాటు అసెంబ్లీని నిర్వహించే అవకాశం ఉంది. ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ వస్తుందా రాదా అన్నదానితో నిమిత్తం లేకుండా చాలా అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా ప్రజల ముందు పెట్టాల్సిన చాలా సమాచారం ఉందని.. రాష్ట్రాన్ని ఏ స్థాయిలో వైసీపీ నేతలు దోచుకున్నారో ఆ లెక్కలన్నీ ఇప్పుడు ఆధారాలతో సహా బయట పెట్టాల్సి ఉందన్న నిర్ణయానికి వచ్చినట్లుగా చెబుతున్నారు.మద్యం,ఇసుక స్కాముల్లో ఎంత దోపిడీ చేశారో.. ఎవరెవరు మనీ లాండరింగ్ కు పాల్పడ్డారో మొత్తం ఆధారాలతో సహా ఇప్పటికే వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలను ప్రజల ముందు ఉంచేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. మరో వైపు జగన్మహోన్ రెడ్డి తాను అసెంబ్లీకి రానని తాడేపల్లి ప్యాలెస్ నుంచే ప్రశ్నిస్తానని అంటున్నారు. పథకాల కోసమే చంద్రబాబుకు ప్రజలు ఓట్లేశారని అంటున్న ఆయన అదే నిజం అయితే.. అసెంబ్లీకి వచ్చి కొన్ని పథకాలను ఇంకా ప్రారంభించకపోవడంపై ప్రశ్నించాల్సి ఉంది. కానీ అసెంబ్లీకి రావడం అంటే కొట్టుకోవడానికే అన్నట్లుగా ఆయన తీరు మనస్తత్వం ఉంది. అందుకే వెళ్లాల్సిన పని లేదని అనుకుంటున్నారు.ప్రజాస్వామ్యంలో అసెంబ్లీకి వెళ్లని ప్రతిపక్షం ప్రజల మద్దతు కూడగట్టడం అసాధ్యం అవుతుంది. అసెంబ్లీలో అవమానిస్తే. దాడులు చేస్తే అది జగన్ కే ప్లస్ అవుతుంది . ప్రజలు అలాంటివాటిని సహించరు. చంద్రబాబు కూడా అలాంటి వాటిని ప్రోత్సహించరు. అయినా జగన్ ధైర్యం చేయలేకపోతున్నారు. సంఖ్యాబలం ప్రకారం మాట్లాడే అవకాశం ఉంది. చంద్రబాబుతో సమానంగా మాట్లాడే చాన్సివ్వాలి..ఆయనతో పోటీగా ప్రోటోకాల్ కావాలి అంటే ఎవరూ పట్టించుకోరు. పరిస్థితులకు తగ్గట్లుగా రాజకీయం చేయడం చాలా ముఖ్యం. కానీ జగన్ ఆ పాయింట్ మిస్సవుతున్నారు.ఈ సారి ఆయనపై అనర్హతా టార్గెట్ లక్ష్యంగా ప్రభుత్వం అసెంబ్లీ సమావేశ తేదీలు ఖరారు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. జగన్ ఉన్న అరవై రోజుల పిరియడ్ ను పూర్తి చేసి ఆయనపై తదుపరి చర్యలు తీసుకోనున్నారు. ఈ లోపు చాలా రాజకీయాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. జగన్ సజ్జల మాటల్ని నమ్మి.. రాజకీయాలు చేస్తారో..కాస్త ముందు చూపుతో వ్యవహరిస్తారో చూడాల్సి ఉంది.

Related posts

తిరుమలకు వీఐపీలు వచ్చినప్పుడు హడావుడి ఉండకూడదు: చంద్రబాబు

TV4-24X7 News

చిన్నసింగనపల్లెలో 12,14వ తేదీ గజ పూజ

TV4-24X7 News

నిత్య పెళ్లికూతురిపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు..

TV4-24X7 News

Leave a Comment