Tv424x7
Andhrapradesh

ఎస్సై ఉద్యోగ ఫలితాలు ప్రకటించుకోవచ్చు: ఏపీ హైకోర్టు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోఎస్ఐ నియ‌మాకాల ఫ‌లితాల‌కు హైకోర్టు మంగళవారం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది…త‌మ ఎత్తు కొల‌త‌ల‌ విష‌యంలో అన్యాయం జ‌రిగిందంటూ దాఖ‌లైన పిటిష‌న్ ను విచార‌ణ అనంత‌రం కొట్టివేసింది..కాగా, ఎస్సై నియామకాల్లో ఎత్తు కొలతల అంశంలో అవకవతకలపై దాఖలైన పిటిషన్​పై నేడు ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది.ఎత్తు కొలతల అంశంలో అభ్యంతరం వ్యక్తం చేసిన అభ్యర్థులకు న్యాయమూర్తి సమక్షంలో పరీక్షలు నిర్వహించారు.అయితే రిక్రూట్​మెంట్​ బోర్డు కొలతలు.. న్యాయమూర్తి సమక్షంలో నిర్వహించిన కొలతలు సరిపోవడంతో.. అభ్యర్థుల అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో రిక్రూట్​మెంట్​పై విధించిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేసింది.ఉత్తర్వులను ఎత్తేసిన నేపథ్యంలో ఫలితాలను విడుదల చేసుకోవచ్చని రిక్రూట్​మెంట్​ బోర్డుకు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.ఇది ఇలా ఉంటే పిటిషనర్​ తరపున వాదనలు వినిపించిన న్యాయవాజది జడ శ్రావణ్​ కుమార్​ 2019లో ఎత్తు అంశంలో అర్హత సాధించారని హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు.2019లో అర్హతగా పరిగణలోకి తీసుకున్న అభ్యర్థుల మెడికల్ సర్టిఫికెట్స్​ను న్యాయస్థానానికి అందించారు.దీంతో అభ్యర్థుల మెడికల్​ సర్టిఫికెట్స్​ పునః పరిశీలన చేసి వారం రోజుల్లో కోర్టు ముందు ఉంచాలని రిక్రూట్​మెంట్​ బోర్డు అధికారులను హైకోర్డు ఆదేశించింది.తదుపరి విచారణను న్యాయస్థానం వారం రోజులకు వాయిదా వేసింది…

Related posts

నారా లోకేష్ ని మర్యాదపూర్వకంగా కలిసిన సీతంరాజు సుధాకర్

TV4-24X7 News

ఏపీలో కేజీబీవీల్లో 729 పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ

TV4-24X7 News

మైదుకూరు మున్సిపల్ కార్యాలయం నందు ఘనంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు

TV4-24X7 News

Leave a Comment