తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనికోసం హైదరాబాద్ లోని లాల్ బహదూర్ స్టేడియంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న పనులను తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పరిశీలించారు. డీజీపీ రవి గుప్తా, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ లతో కలిసి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. శానిటేషన్ ఏర్పాట్లను ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు.
