రైతులకు ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు భరోసా.అధైర్యపడొద్దు..నష్టపోయిన ప్రతి రైతునూ ఆదుకుంటాం**- తుఫాను సమయంలో ప్రతి ఒక్కరికీ అందుబాటులో ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు.**గత మూడు రోజులుగా కొన్ని చోట్ల మిచాంగ్ తుఫాను కారణంగా ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షాల వల్ల జరిగిన పంట నష్టాలను అంచనా వేసి, పంట నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుందని అధైర్యపడాల్సిన అవసరం లేదని, ఈ మేరకు గౌరవ ముఖ్యమంత్రివర్యులు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు ఐ. తిరుపాల్ రెడ్డి గారు రైతులకు భరోసా కల్పించారు.**కడప జిల్లాలోని ప్రతి మండలంలోని నష్టం జరిగిన ప్రతి గ్రామాన్ని పంట నష్టం అంచనా వేయించడం జరిగింది. భారీ వర్షాల వల్ల పంటలపై పడిన ప్రభావాన్ని, నష్టపోయిన రైతాంగాన్ని స్వయంగా తెలుసుకున్నారు. పంట నష్టం జరక్కుండా పొలాల నుంచి నీటిని బయటకు పంపించేందుకు అధికారులు చేసిన ఏర్పాట్లపై ఆరా తీశారు. ఏ ఒక్క రైతు బాధపడకుండా పంట నష్టం వివరాలను ఖచ్చితంగా నివేదించాలని ప్రతి జిల్లా వ్యవసాయ మరియు అనుబంధ అధికారులను ఆదేశించారు.**రైతులతో మాట్లాడి ప్రభుత్వ పరంగా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని అధైర్యపడాల్సిన అవసరం లేదని తెలిపారు
