Tv424x7
Andhrapradesh

లోక్ అదాలత్ లో దేశం మొత్తం మీద 1.17 కోట్ల కేసులు పరిష్కారం

దేశ వ్యాప్తంగా 34 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో నిన్న నిర్వహించిన 4వ జాతీయ లోక్ అదాలత్ కోట్ల కేసులు పరిష్కారం అయినట్లు జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ వెల్లడించింది.వీటిలో 11 లక్షలకు పైగా పెండింగ్ కేసులు, 1.05 కోట్లకు పైగా ప్రీలిటిగేషన్ కేసులు ఉన్నాయని పేర్కొంది.ఈ వివాదాల విలువ 20,150 కోట్ల రూపాయలని తెలిపింది.ఈ జాతీయ లోక్ అదాలత్ లో భాగంగా నిన్న కొత్తూరు లో జూనియర్ సివిల్ కోర్ట్ జడ్జ్ ఎస్ మణి ఆదేశాల మేరకు జరిగిన లోక్ అదాలత్ లో 398 కేసులు పరిష్కారం కావడంతో పాటు 2,84,910 రూపాయల అపరాధ రుసుము, కక్ష్య దారుల నుంచి 8,840 రూపాయిల నగదు కోర్ట్ వారు వశ పరుచుకోవటం జరిగింది.

Related posts

35 వ వార్డు లో అంగన్వాడి భవనం ప్రారంభం

TV4-24X7 News

మళ్లీ పెరుగనున్న ఉష్ణోగ్రతలు

TV4-24X7 News

అంగన్వాడీ కార్యకర్తలను కలిసిన మాజీ మంత్రి పేర్ని తప్పక ఆదుకుంటాం అంటూ హామీ..

TV4-24X7 News

Leave a Comment