కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ప్రాణాపాయం తప్పింది. తన రెండు రోజుల ముంబై పర్యటన ముగించుకుని గుజరాతు బయలుదేరబోతుండగా ఆయన ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. దీనిని ముందుగానే గుర్తించిన సిబ్బంది విమానాన్ని నిలిపివేశారు. అనంతరం షా తన కుటుంబంతో కలిసి మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేకు చెందిన విమానంలో గుజరాత్ కు బయలుదేరారు.
