ఆంధ్రప్రదేశ్ : అల్పపీడన ప్రభావం కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 3 రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు, ఇతర జిల్లాల్లో ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈదురు గాలులు సైతం వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

next post