హైదరాబాద్:బీఆర్‌ఎస్‌లో కలకలం రేపుతున్న కవిత వ్యాఖ్యల నేపథ్యంలో ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి, ఇతర కీలక నేతలు హాజరయ్యారు.కవిత వరుస వివాదాస్పద వ్యాఖ్యలు, వాటి ప్రభావం పార్టీపై పడుతున్న తీరును చర్చించినట్లు సమాచారం. పార్టీ భవిష్యత్తు, నాయకత్వ సమైక్యత దృష్ట్యా కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకునే అవకాశముందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.కవితపై వేటు వేయడం సహా పలు కఠిన చర్యలపై చర్చ జరిగినట్టు తెలిసింది. దీనిపై తుది నిర్ణయం వచ్చే 24 గంటల్లో వెలువడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి.
