నాగ్పూర్ నుండి కోల్కతా వెళ్తున్న ఇండిగో విమానాన్ని పక్షి ఢీకొట్టింది. విమానం టేకాఫ్ అయిన వెంటనే ఈ ఘటన జరిగింది. దీంతో అప్రమత్తమైన పైలట్ ముందు జాగ్రత్తగా విమానాన్ని తిరిగి నాగ్పూర్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. విమానంలో ఉన్న 272మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు.

previous post