గణపయ్యను సాగనంపేందుకు వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిన తండ్రీకొడుకులు.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దుండిగల్ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం తన ట్రాలీ ఆటోలో వినాయకుడిని నిమజ్జనం చేసేందుకు మొతీచెరువుకు వెళ్లిన శ్రీనివాస్(35) అతని కొడుకు జాన్ వెస్లీ(7)
చెరువుకట్టపై రివర్స్ తీసే క్రమంలో ఆటో చెరువులోకి దూసుకెళ్లగా, చీకటిగా ఉండడం వల్ల ఎవరూ గమనించకపోవడంతో, ఆటోతోపాటు పూర్తిగా నీటమునిగిన తండ్రీకొడుకులు
సోమవారం ఉదయానికి కూడా భర్త కొడుకు ఇంటికి రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య
చెరువులో గాలింపు చర్యలు చేపట్టి ట్రాలీ ఆటోతో పాటు తండ్రీకొడుకుల మృతదేహాలను గుర్తించిన పోలీసులు
చెరువు వద్ద నిమ్మజనానికి తగిన ఏర్పాట్లు చేయకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపిస్తున్న కుటుంబ సభ్యులు.