చంద్రబాబు వెన్నుపోటుదారుడు కాదు, పార్టీని కాపాడిన ప్రొటెక్టర్ అన్న వర్ల
అసలైన వెన్నుపోటు రాజకీయాలు మొదలైందే వైఎస్ కుటుంబం నుంచి అని విమర్శలు
తండ్రి, తల్లి, చెల్లి, బాబాయికి వెన్నుపోటు పొడిచిన వ్యక్తి జగన్ రెడ్డి అని ఆరోపణ
సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, రోజా కానీ బహిరంగ చర్చకు రావాలని ఆయన సవాల్.
చంద్రబాబు వెన్నుపోటుదారుడు కాదని, ఆయన పార్టీని, రాష్ట్రాన్ని కాపాడిన నిజమైన ‘ప్రొటెక్టర్’ అని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య స్పష్టం చేశారు.
అసలైన వెన్నుపోటు రాజకీయాలకు ఆద్యులు వైఎస్ కుటుంబీకులేనని, వైసీపీ అధినేత జగన్ సిసలైన ‘వెన్నుపోటుదారుడు’ అని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబుపై దశాబ్దాలుగా చేస్తున్న వెన్నుపోటు ఆరోపణలపై ఎవరైనా తనతో బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. మంగళవారం నాడు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ ఘాటు వ్యాఖ్యలు చేశారు.