కడప పర్యటనలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ని మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ కలిసి వినతిపత్రం సమర్పించారు.రైతుల పక్షపాతి, రైతు బాంధవుడిగా గుర్తింపు పొందిన పుట్టా సుధాకర్ యాదవ్, అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ మరమ్మతులు పూర్తి చేసి రైతులకు ఉపశమనం కలిగించాలన్న సంకల్పంతో ముందడుగు వేశారు.
🔹 కేసీ కెనాల్ పరిధిలోని 92 వేల ఎకరాల ఆయకట్టుకు త్రాగు, సాగునీరు అందించగల సామర్థ్యం గల ఈ రిజర్వాయర్ 2019లో భారీ వర్షాల కారణంగా దెబ్బతింది.
🔹 మరమ్మత్తులకు 36 కోట్ల రూపాయల నిధులు అవసరమని నీటిపారుదల శాఖ అంచనాతో ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపింది.
🔹 ప్రాజెక్టు పూర్తయితే రైతులకు సంవత్సరానికి ₹250 కోట్ల లాభం వచ్చే అవకాశం ఉందని ఎమ్మెల్యే తెలిపారు.
ఈ సందర్భంగా పుట్టా సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ:👉 “మైదుకూరు నియోజకవర్గం రైతుల పంట కల సాకారం కావాలంటే అలగనూరు రిజర్వాయర్ పూర్తి కావాలి. అందుకోసం నిధులు వెంటనే మంజూరు చేయాలి” అని అభ్యర్థించారు.
మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ
✅ “అలగనూరు ప్రాజెక్టు పూర్తి అయ్యేందుకు కావలసిన నిధుల మంజూరులో త్వరితగతిన చర్యలు తీసుకుంటాను” అని హామీ ఇచ్చారు.
📍 అలాగే, సీఎం చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన రాజోలి ఆనకట్ట హామీ అమలుకు ప్రత్యామ్నాయ పరిష్కారంగా అలగనూరు ప్రాజెక్టు ప్రాధాన్యతను పుట్టా సుధాకర్ యాదవ్ వివరించారు.