కడప జిల్లా పర్యటనలో భాగంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ క్యాంపు కార్యాలయంలో పలు నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, బద్వేల్ ఇంచార్జి రితీష్ రెడ్డి, కాశి నాయన మండల నాయకులు బసిరెడ్డి రవీంద్రరెడ్డి మంత్రి లోకేష్‌ను కలిసి జ్యోతి క్షేత్ర సమస్యలను వివరించారు.జ్యోతి క్షేత్ర అభివృద్ధి కోసం ఎదురవుతున్న ఆటంకాలను తొలగించి, ఆ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని వారు విన్నవించారు. దీనిపై మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ, కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాల పెద్దలతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటానని, జ్యోతి క్షేత్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు.
