*:కూటమి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన స్త్రీ శక్తి పథకం వల్ల తమ ఉపాధిని కోల్పోయామని, అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆటో కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.ఆటో కార్మికులకు అన్యాయం జరగకుండా ప్రభుత్వం ఏటా 15000 ఇస్తుందని మాటలలో చెప్పడమే తప్ప చేతల్లో లేదని మా కార్మికుల కుటుంబాలు పడుతున్న బాధను తీర్చాలంటే మాకు 25000 కచ్చితంగా ఇవ్వాలని. గత సంవత్సరం బకాయికి ఈ సంవత్సర బకాయిని కూడా కలిపి 50000 చెల్లించాలని మరియు 50 సంవత్సరాలు నిండిన మా ఆటో డ్రైవర్లకు పెన్షన్ వసతి కలుగచేయాలని కోరారు. రేపటి నుంచి నల్ల బ్యాడ్జిలతో ఆటో కి నల్ల జండాతో మా నిరసన ప్రభుత్వానికి తెలియచేస్తామని తదుపరి కార్యాచరణ రేపు జరగబోవు రామచంద్రాపురం డివిజన్ ఆటో కార్మికులతో కూడా చర్చించి త్వరలో 48 గంటలు నిరహార దీక్ష చేపడతామని ఆటో డ్రైవర్ల జీవనోపాధికి ప్రభుత్వం తగు భద్రత కల్పించేవరకు దఫా దఫాలుగా నిరసన కార్యక్రమాన్ని ఉధృతం చేస్తామని .కోనసీమ జిల్లా జనరల్ సెక్రటరీ ఊటాల వెంకటేష్ తెలియచేశారు.ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు వాసంశెట్టి సత్తిరాజు మరియు మండల డివిజన్ జిల్లా ఆటో కార్మిక సంఘాల నాయకులు,సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
