మాజీ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఎస్‌కే జోషి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి ఘోష్ కమిషన్ నివేదికపై కీలక వ్యాఖ్యలు చేశారు.
“ఘోష్ కమిషన్ రిపోర్టు మీకు ఎలా వచ్చింది?” అని హైకోర్టు న్యాయమూర్తి జోషిని ప్రశ్నించారు. కమిషన్ నివేదికపై స్టే ఇవ్వాలన్న జోషి అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది.
కమిషన్ నివేదికల విషయంలో పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని జోషికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే బుధవారంకి (సెప్టెంబర్ 10) వాయిదా వేసింది.