వైఎస్సార్సీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మరియు ఎమ్మెల్సీ శ్రీ ఆర్. రమేష్ యాదవ్ గారు, మైదుకూరు నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు శ్రీ నక్కా సుధాకర్ గారిని పరామర్శించారు.
ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన సుధాకర్ గారు ప్రస్తుతం కోలుకుంటున్న విషయం తెలుసుకొని, శ్రీ రమేష్ యాదవ్ గారు సెప్టెంబరు 3న నాగసానిపల్లెలోని వారి నివాసానికి వెళ్లి వ్యక్తిగతంగా పరామర్శించారు.
ఈ సందర్బంగా ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై వివరాలు తెలుసుకొని, త్వరగా పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కడప జిల్లా బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు నేట్లపల్లి శివరాం గారు, ఇతర ప్రముఖ బీసీ నేతలు పాల్గొన్నారు.