Tv424x7
Telangana

హరీష్ రావుపైనే పెద్ద కుట్ర జరుగుతోందా ?

భారత రాష్ట్ర సమితి అంతర్గత రాజకీయాలను చూస్తున్న వారికి క్లియర్ గా ఒక్కటే అర్థమవుతోంది.. కేసీఆర్ ఫ్యామిలీ ఒక్కటే..కానీ ఆ ఫ్యామిలీలో హరీష్ రావు లేడు.. సంతోష్ రావు లేడు. వారిద్దరినే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?.

సంతోష్ రావు నేరుగా పాలిటిక్స్ లో లేడు. హరీష్ రావు ఉన్నారు. ఆయన బీఆర్ఎస్ లో కేటీఆర్ కన్నా ఎక్కువ ప్రభావం చూపగల నాయకుడు అనేది ఎక్కువ మంది నమ్మకం.ఇప్పుడు ఆయనపైనే ఎందుకు కుట్రలు జరుగుతున్నాయన్నది కొంత మందికి వచ్చిన సందేహం.

హరీష్ రావుపై ఇప్పటి వరకూ నిర్దిష్టమైన ఆరోపణలు లేవు. ఆయనకు పెద్ద పెద్ద వ్యాపారాలు ఉన్నాయని .. ఆస్తులు ఉన్నాయని ఎవరూ ఆరోపణలు చేయలేదు.

బీఆర్ఎస్ నేతలు అసలు చేయలేదు. ఇప్పుడు కొత్తగా కవిత సంచలన ఆరోపణలు చేస్తున్నారు. కవిత అవినీతి ఆరోపణలు చేయడమే కాదు.. పార్టీని క్యాప్చర్ చేస్తారని కూడా చెప్పారు. అంటే హరీష్ రావుపై పూర్తి స్థాయిలో పార్టీ నాయకత్వంలో అనుమానాలు పెంచే ప్రయత్నాలు చేశారని అనుకోవచ్చు.

హరీష్ రావును కేసీఆర్ ఒక్కో సారి దగ్గరకు తీసుకుంటున్నారు.. ఒక్కోసారి దూరం పెడుతున్నారు.దానికి కారణంగా ఎక్కువ మంది కేటీఆర్ ను ముందుకు తీసుకెళ్లమేనని అనుకుంటున్నారు. కానీ కవిత మాత్రం హరీష్ రావు అవినీతి కారణంగానేనని అంటున్నారు. కారణం ఏదైనా హరీష్ రావు ఇప్పటి వరకూ పార్టీకి కానీ..

కేసీఆర్, కేటీఆర్ కు కానీ వ్యతిరేకంగా ఎప్పుడూ ఒక్క మాట మాట్లాడలేదు.కానీ హరీష్ పై ఇప్పుడు భయంకర దాడి పార్టీ నుంచే జరుగుతోంది. దీని వెనుక ఏదో ఉందని.. అనుమానించక తప్పని పరిస్థితి కనిపిస్తోంది.

నిన్నామొన్నటి వరకూ కేటీఆర్ పై కవిత అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ నడపడం చేత కాదన్నారు. కానీ ఇవాళ రామన్న..రామన్న అభిమానం చూఫారు.మాట్లాడి 103 రోజులు అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ మొత్తం చూస్తే.. హరీష్ రావు మాత్రమే టార్గెట్ అయ్యారని అర్థం చేసుకోవచ్చు.

Related posts

కాంగ్రెస్ వంద రోజుల పాలనకు లోక్ సభ ఎన్నికలు రెఫరండం

TV4-24X7 News

నేను బ్రతికున్న సచ్చిపోయాయని అంటున్నాది ఈ సర్కార్

TV4-24X7 News

BRS పార్టీలో భారీగా చేరికలు… వారు ఎవరంటే….!

TV4-24X7 News

Leave a Comment