ఏపీ రాష్ట్రంలో నేటి నుంచి నూతన బార్ పాలసీ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో ఉదయం 10.00 గంటల నుంచి అర్థరాత్రి 12.00 గంటల వరకు బార్లు తెరచి ఉండనున్నాయి. ఈ విధానం సోమవారం నుంచి అంటే..
సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో దేశంలోని అన్ని ముఖ్య నగరాలలో దాదాపుగా ఇదే విధానం అమలు అవుతోంది. దాంతో ఆ యా నగరాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ సైతం చేరినట్లు అయింది.
ఈ నూతన బార్ పాలసీ 2025 నుంచి 2028 వరకు అమలులో ఉండనుంది. అయితే గతంలో పాత పాలసీ ప్రకారం.. రాత్రి 11.00 గంటలకు బార్లను మూసి వేయాల్సి ఉండేది.
కానీ నూతన విధానంతో ఒక గంట మేర బార్లను నిర్వహించుకోనే విధానాన్ని నిర్వాహకులకు ఈ పాలసీ ద్వారా ప్రభుత్వం కల్పించింది.
ఈ మేరకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ నిశాంత్ కుమార్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ ప్రభుత్వం తాజాగా తీసుకువచ్చిన ఈ ఉత్తర్వుల్లో భాగంగా 10 శాతం మద్యం షాపులను కల్లు గీత కులాలకు కేటాయించిన విషయం విదితమే.