పోరుమామిళ్ల (కడప జిల్లా):
పోరుమామిళ్ల మండలం గానుగపెంట గ్రామానికి చెందిన ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ బి. రమణయ్య మృతి పట్ల జిల్లా ఉపాధి హామీ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ మల్లేశ్వర రెడ్డి, ఏపీవో రవీందర్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
గురువారం రోజు మల్లేశ్వర రెడ్డి, ఉపాధి శాఖ సిబ్బందితో కలిసి రమణయ్య పార్థివ దేహాన్ని సందర్శించి పుష్పాంజలులు సమర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, ఈ కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని ఓదార్పు పలికారు. ప్రభుత్వం ద్వారా అవసరమైన సహాయం అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ సందర్బంగా ఏపీవో రవీందర్ రెడ్డి, ఈసీ కాజా గంగాధర్, టెక్నికల్ అసిస్టెంట్లు రామాంజనేయ రెడ్డి, విజయ్ కుమార్, శ్రీకాంత్, బాలయ్య, ఓబయ్య, మండలంలోని ఫీల్డ్ అసిస్టెంట్లు, ఉపాధి హామీ యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
రమణయ్య కుటుంబానికి సంఘీభావం తెలిపిన ప్రతి ఒక్కరికీ గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.